మంత్రి సీతక్కకు కామధేను ప్రతిమ బహూకరణ
మంగపేట, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ( సీతక్క ) జన్మదిన వేడుకల్లో గురువారం మంగపేట మండలం అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్, ఆత్మ ఏటూరునాగారం డివిజన్ మాజీ చైర్మన్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పాల్గొని మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి సీతక్కను శాలువాతో ఘనంగా సన్మానించి, హిందువుల పూజకు ప్రతీక, శుభానికి సంకేతం అయిన కామధేను (ఆవు, లేగ దూడ) కలప ప్రతిమను సీతక్కకు సాంబశివ రెడ్డి బహూకరించారు.
ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ.. పేదల పాలిట పెన్నిధి, అభివృద్ధి ప్రధాత, ములుగు ప్రజల ఆడబిడ్డ మంత్రి సీతక్కకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాను బహూకరించిన కామధేను ప్రతిమను చూసి మంత్రి సీతక్క మురిసిపోయారని, తన జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతీ ఏటా వ్యవసాయానికి చిహ్నమైన ఏదో ఒక బహుమతిని సాంబశివరెడ్డి తనకు ఇస్తారని సాటి కాంగ్రెస్ నాయకులతో మంత్రి సీతక్క వ్యాఖ్యానించి, తనను అభినందించినట్లు సాంబశివరెడ్డి తెలిపారు.
