ప్రజల్లో మమేకమై సేవ చేస్తేనే ఎంతో గుర్తింపు
ఎంపీడీవో ఉమర్ షరీఫ్
జన్నారం, ఆంధ్రప్రభ: ప్రజల్లో మమేకమై సేవ చేస్తేనే ఎంతో గుర్తింపు వస్తుందని స్థానిక ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు.మండల పంచాయతీ కార్యదర్శుల,ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం హాలులో గత నెల 30తో పదవీ విరమణ పొందిన హౌసింగ్ ఏఈ లాయక్ అలీకి బుధవారం వీడ్కోల సమావేశం నిర్వహించి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి సన్మానించారు.
ఆ తర్వాత బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, లావణ్య,వినోద్ లను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఏఈ లాయక్ అలీ ఉద్యోగురీత్యా నిబత్త నిబద్దతగల క్రమశిక్షణ గలవరన్నారు.అతను మచ్చలేని వ్యక్తిగా ప్రజా ప్రతినిధుల, అధికారుల, ప్రజల మన్ననలు పొందాడని ఆయన కొనియాడారు.
విధుల్లో చేరిన హౌసింగ్ ఏఈ చంద్రశేఖర్,ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శులు కలీం,సీడం జాకు,శ్యామ్ చందులను స్వాగతం పలుకుతూ శాలువాలు కప్పి సన్మానించారు. ఈజీఎస్ ఏపీవో రవీందర్,ఎంపీఓ జలంధర్, తెలంగాణ కార్యదర్శుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.శ్రీనివాస్, కార్యదర్శులు ఆర్. రాహుల్,గుర్రం రాము, మహేష్,రమేష్,సాగర్, సంతోష్,ప్రతిభ,కరుణ, తదితరులు పాల్గొన్నారు.
