పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
- ముగ్గురి అరెస్ట్, నగదు స్వాధీనం
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మండలం చెల్లయిపే, దుగ్నేపల్లి గ్రామాల శివారుల్లో పేకాట ఆడుతున్నట్లు తమకున్న సమాచారం మేరకు తమ సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించి ముగ్గుగురిని పట్టుకున్నట్లు చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చల్లాయిపేట, దుగ్నెపెల్లి గ్రామాల శివారుల్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగ్గ సమాచారం మేరకు తమ పోలీసు సిబ్బందితో కలిసి స్థావారాలపై దాడులు చేసి ముగ్గురిని పట్టుకోగా మరో 15మంది పోలీసుల రాకను గమనించి పరరైనట్లు సీఐ తెలిపారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 67వేల నగదు, మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
