పెడన అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

రూ.6.5 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం

పెడన, ఆంధ్రప్రభ: పెడన పట్టణంలోని 5వ వార్డులో రూ.4.5 లక్షల వ్యయంతో 85 మీటర్ల సీసీ రోడ్డు, రూ.2 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన పట్టణ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.