ఉద్యమిస్తేనే పీఆర్సీ సాధ్యం: తపస్ నాయకులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఉద్యమాల ద్వారానే పీఆర్సీ అమలు సాధ్యమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా సమన్వయకర్త నర్సింగప్ప అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శేషప్ప, మండల అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి గోపాల్‌తో కలిసి మాట్లాడారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చి, మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు. పీఆర్సీ అమలు చేయాల్సిన గడువు దాటిపోయినా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉంచడం గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం కంటే పీఆర్సీ కమిటీ నివేదికకే ఎక్కువ సమయం పట్టడం విచారకరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హక్కులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేసి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు బన్నేష్, తిరుపతి నాయక్, అనిత, కల్పన, నర్సిములు, కేశవులు, ఉపాధ్యాయులు బాలు, అశోక్, స్వప్న, సోహైల్, స్వరూపరాణి, శివాని, స్వరూప్‌రాజ్, రవళిక తదితరులు పాల్గొన్నారు.