CCTV camera | రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత
CCTV camera | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గ్రామానికి చెందిన రైతు శ్రావణ్‌కు చెందిన కోళ్ల ఫారం వద్ద అర్థరాత్రి చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అర్థరాత్రి సమయంలో ఫారం పరిసరాల్లోకి వచ్చిన చిరుతను గమనించిన కుక్కలు గట్టిగా అరవడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తుండటంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువులు, చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు, చిరుతను బంధించి అటవీ ప్రాంతానికి తరలించేలా వెంటనే చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
