విద్యుత్ షాక్ తో రైతు మృతి..
ముత్తారం, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన మారం వెంకట్ రెడ్డి అనే రైతు విద్యుత్ షాక్ కు గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. వెంకట్ రెడ్డి మంగళవారం ఉదయం పొలం పనుల కోసం వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్ సరిచేసే ప్రయత్నంలో 11 కేవీ విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు సమాచారం. ట్రాన్స్ఫార్మర్ పైనే మృతదేహం వేలాడుతూ ఉండడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

