కాంగ్రెస్ పార్టీలో చేరికలు…

కాంగ్రెస్ పార్టీలో చేరికలు…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు వార్డు సభ్యులు మానకొండూరు శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముత్త బీరయ్య, దయ్యాల ఐలవ్వ–ఐలయ్య, ఏనుగుల అనిత–అశోక్, నల్లగొండ రాములు, జనగం లక్ష్మి–లక్ష్మయ్యలకు పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

తమ చేరికపై వార్డు సభ్యులు మాట్లాడుతూ తోటపల్లి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఐదుగురమూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల ఐలేష్, బైర సంతోష్, గుంటి అంజి, గుంటి అశోక్, గుంటి ఓదెయ్య, ఒగ్గు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply