జుక్కల్ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా కిరణ్‌కు ఘన సన్మానం..

డోంగ్లీ, ఆంధ్రప్రభ: డోంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా గాలిపూర్ సర్పంచ్ కిరణ్ ఎన్నిక కావడంతో ఆయనను డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కిరణ్‌కు శాలువా కప్పి, మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

కొత్త బాధ్యతలు చేపట్టిన కిరణ్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కిరణ్ ఎన్నికపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సాయిగౌడ్, మొహమ్మద్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మొహమ్మద్‌నగర్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రమేష్ యాదవ్, ధోతి సర్పంచ్ సంగ్రామ్ పటేల్, నాయకులు ఉమాకాంత్ పటేల్, చాంద్ పటేల్, ధనంజయ్ పాటిల్, హన్మంత్ పాటిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.