కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలందర్ చేతుల మీదుగా 8 మంది లబ్ధిదారులకు చెక్కులను శనివారం పంపిణి చేశారు.
చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు అలకుంటా గంగు, బస రజిని,చెన్నవెని శ్రాగవి, బాల్కొండ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునిల్ అన్న గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బస వేణుగోపాల్ యాదవ్, ఆర్ ఐ శరత్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్,వార్డ్ మెంబర్లు దాసరి రాకేష్, అజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం రాజేశ్వర్, వన్నెల రాజేశ్వర్,సాదుల్ల,సుంకరి విజయ్, నరేష్,ఆంజనేయులు,నజీర్, మొకిన్,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
