కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి..

కన్న కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి..

ఖమ్మం జిల్లా కల్లూరు,ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా కల్లూరు లో జరిగిన సంఘటన. స్థానికుల వివరాలు ప్రకారం…. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన కొత్తపల్లి సీతారాములు ఆటో డ్రైవర్… శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో మద్యం మత్తులో తన ఒక్కగానొక్క కుమారుడు కొత్తపల్లి కిరణ్ కుమార్(30) ను దగ్గరలోని బెల్ట్ షాపుకు తీసుకువెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి తిరిగి తన ఇంటికి తీసుకొచ్చి విసక్షణారహితంగా కొట్టి, తల వెనక భాగంపై బలమైన గాయం చేయడంతో విపరీతమైన రక్తస్రావంతో కిరణ్ కుమార్ కుప్పకూలిపోయాడు. కిరణ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తండ్రి సీతారాములు తన ఆటోలో పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి హంతకుడిని గాలిస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.