రేగొండలో యువకుడు దారుణ హత్య..
రేగొండలో యువకుడు దారుణ హత్య..
పాస్ట్ ఫుడ్ నిర్వహిస్తున్న యువకుడు మర్డర్
వివాహేతర సంబంధం కారణమ?
రేగొండ, ఆంధ్రప్రభ : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) అనే యువకుడు మండల కేంద్రంలోనీ వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ జీవనం కొన సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు షాప్ ముసి ఇంటికి వెళ్తుండగా
హత్యకు గురయ్యాడు. యువకుడి హత్యకు వివాహేతర సంబంధం కారణమా లేదా మరే దైన కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. హత్య చేసిన యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది .మృతుడు శ్రవణ్ కు భార్య మౌనిక ,ఒక కూతురు ,కుమారుడు ఉన్నారు.
