భూ పోరాట సభకు వెళ్తుండగా ఆలేరు ఉద్యమకారుల అదుపు

  • ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

ఆలేరు, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో నిర్వహించనున్న మలిదశ ఉద్యమకారుల భూ పోరాట సభకు హాజరయ్యేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి గురువారం బయలుదేరిన పలువురు ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో జంపాల శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, ముదిగొండ మహేందర్, కాసగళ్ల అనసూయ, మొరిగాడి ఇందిర, సీస మహేశ్వరి తదితరులు ఉన్నారు.