july2ndindrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఒక్కరోజే 31 వేల మందికి పైగా దర్శనం

july2ndindrakeeladri | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :  విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి బుధవారం (జూలై 1) కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు విడుదల చేసిన రోజువారీ గణాంకాల ప్రకారం, 31,064 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ దర్శనాల కోసం 4,588 దర్శన టికెట్లు జారీ చేశారు. ఆలయంలో ప్రసాదాల విక్రయాలు కూడా జోరుగా సాగాయి. రోజంతా 49,000 యూనిట్ల ప్రసాదం విక్రయించగా, భక్తుల నుంచి రూ.3,48,788 విరాళాల రూపంలో అందాయి.

ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవల్లో 289 మంది భక్తులు పాల్గొన్నారు. మొక్కుబడులు తీర్చుకునే క్రమంలో 1,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా 7,162 మంది భక్తులు ఉచిత భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతుండగా, దర్శనం, ప్రసాదాల పంపిణీ, సేవలు, అన్నదానం వంటి అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.