వీబీజీ రామ్ జీ పథకంతో మేలు
- టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు
- 125 రోజుల పెంపు పట్ల కూలీలు ఆనందం: ఎండిఓ
ఘంటసాల, ఆంధ్రప్రభ: కేంద్రం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ పథకం కూలీలకు ఎంతో మేలు చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు తెలిపారు. గురువారం కొడాలిలో వీబీజీ రామ్ జీ పథకాన్ని చౌదరి బాబు, ఎండీఓ డి.సుబ్బారావు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎండీఓ మాట్లాడుతూ గతంలో 100 రోజులు ఉన్న పథకం 125 రోజులకు పెంచినట్టు తెలిపారు. ఈ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్, ఏపిఓ రాజశేఖర్, కూలీలు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
