4-month-low : ఆయిల్ ధర నేల చూపు Andhra Prabha News
4-month-low : ఆయిల్ ధర నేల చూపు Andhra Prabha News
- నాలుగు నెలల్లో కనిష్టం
- బారెల్ $67.75 చేరిక
- దోహాలో అమెరికా, ఇరాన్ చర్చల ఫలితం
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్)
4-month-low : దోహాలో ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన పరోక్ష సాంకేతిక చర్చలు “సానుకూల పురోగతి” సాధించాయని ఖతార్ చెప్పడంతో, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే ఆశలు పెరిగాయి. దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ప్రపంచ చమురు ధరలు మరింత తగ్గాయి, 01:02 GMT సమయానికి, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 73 సెంట్లు లేదా 1.02% తగ్గి బ్యారెల్‌కు $70.84 వద్దకు చేరగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 83 సెంట్లు లేదా 1.21% తగ్గి బ్యారెల్‌కు $67.75 వద్దకు పడిపోయింది. గత సెషన్‌లో, ఈ రెండు ప్రధాన కాంట్రాక్టులు 1% కంటే ఎక్కువ తగ్గిపోగా..,నాలుగు నెలల్లోనే తమ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
