పట్టుదలతో శిఖరాగ్రం.. భూమికకు ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న ఎడగొట్టి భూమిక విజయంపై ఆమె తండ్రి, కదిరి అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ బ్రిగేడ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఈ. నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో ఇది అత్యంత గర్వించదగిన, మరపురాని రోజని తెలిపారు. భూమిక సాధించిన విజయం ఆమె కృషి, పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకోవడం తమ కుటుంబానికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ విజయానికి తన భార్య ఈ. రాజేశ్వరి అందించిన ప్రేమ, ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని ఆయన తెలిపారు. అలాగే తన తమ్ముడు ఈ. రవి (ఏరియా హాస్పిటల్ ఆఫీస్ సూపరింటెండెంట్), కుమార్తె రాసి, కుమారుడు శశి (ఎంబీబీఎస్) అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

భవిష్యత్తులో భూమిక మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని తండ్రిగా ఆకాంక్షించారు