1469Files | డిజిటల్ పాలనలో కృష్ణా టాప్
1469Files | డిజిటల్ పాలనలో కృష్ణా టాప్
1469Files | కృష్ణా జిల్లా అభివృద్ధికి కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక కృషి
డిజిటల్ పాలనలో రాష్ట్రంలో తొలి స్థానం
హాస్టల్ బాలికలకు శానిటరీ ఇన్సిలేటర్ల పంపిణీ
యువ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ద్వారా ప్రోత్సాహం
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు చర్యలు
ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో కృష్ణా జిల్లా రికార్డు
పరిపాలనా నైపుణ్యంలో కృష్ణా జిల్లా ఖ్యాతి మరింత బలోపేతం
1469Files | కృష్ణా, ఆంధ్రప్రభ బ్యూరో : కృష్ణా జిల్లాను సమగ్రాభివృద్ధి వైపు నడిపించేందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అసామాన్యమైన కృషి చేస్తున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. డిజిటల్ పాలనలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అదేవిధంగా 2026వ సంవత్సరంలో హాస్టల్లోని బాలికలకు శానిటరీ ఇన్సిలేటర్లు పంపిణీ చేయటంతో ముఖ్యమంత్రి ప్రశంసించారు. జిల్లాలోని పరిశ్రమల స్థాపనతో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటంతోపాటు ప్రతీ సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ కింది స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు సమిష్టిగా కృషి చేస్తున్నారు. డిజిటల్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన కలెక్టర్‌గాడీకే బాలాజీ నిలిచారు. ఫైళ్ల పరిష్కార సామర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానాన్ని సాధించి, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
తద్వారా పరిపాలనా నైపుణ్యంలో కృష్ణా జిల్లా ఖ్యాతి మరింత బలపడింది. కృష్ణా జిల్లా పనితీరుపై ముఖ్యమంత్రి చేపట్టిన సమగ్ర సమీక్షలో భాగంగా ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కార సామర్థం ఆధారంగా ర్యాంకులను 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేశారు. ఈ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా అందిన 1482 ఫైళ్లలో కలెక్టర్ 1469 ఫైళ్లను పరిష్కరించి, రాష్ట్రంలోనే అత్యంత వేగవంతమైన పరిష్కార రేట్లలో ఒకటిగా నిలిచిన అద్భుతమైన పనితీరుతో కృష్ణా జిల్లాను అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
