మండలి వెంకట కృష్ణారావుకు ఘన నివాళులు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ ; ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అవనిగడ్డ వంతెన సెంటర్‌లోని మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పలువురు కూటమి నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కోడూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన కూటమి నాయకులు రెడ్రౌతు కృష్ణబాబు, కూరాకుల శివప్రసాద్, కూరాకుల చంద్రశేఖర్, కోట పోతురాజు, విస్సంశెట్టి బాపనయ్య, అప్పికట్ల శ్రీనివాసరావు, షేక్ మహబూబ్ బాషా, నరహరిశెట్టి రమేష్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీలు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, డీసీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్లు రేపల్లె పిచ్చేశ్వరరావు, మాదివాడ రత్నారావు, యలవర్తి రాజ నాగ మునేశ్వరరావు (చిన్నా), యర్రంశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు.
అలాగే దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, మండలి రామ్మోహనరావు, బొప్పన కాశీ విశ్వేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
