ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిని కలిసిన జిల్లా ఎస్పీ

గద్వాల, ఆంధ్రప్రభ): జోగుళాంబ గద్వాల జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కె. కళ్యాణ్ చక్రవర్తిని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో సాగిందని అధికారులు తెలిపారు.