Sparta 3 Mystery : అతి రహస్యం Andhra Prabha Top Story

Sparta 3 Mystery : అతి రహస్యం Andhra Prabha Top Story

  • ఉర్సా మేజర్​ మిస్టరీ 1
  • ఉగ్రదాడా?
  • అంతర్గత కుట్రా?
  • ప్రత్యర్థి వేటా?
  • రష్యా వాదన ఏమిటి?
  • ఓడలో రహస్య సరుకు ఏమిటి?
  • మూడు పేలుళ్లు ఎలా జరిగాయి?
  • నాటో సైన్యంపై ఎందుకు అనుమానాలు

ఆంధ్రప్రభ, కార్టజెనా (స్పెయిన్​ )

Sparta 3 Mystery

అది రష్యా సరకు రవాణ నౌక. అసలు పేరు ఉర్సా మేజర్​. దాని మారు పేరు. స్పార్టా 3 . సరీగా 2024లో ఉక్రెయిన్​ పై రష్యా చెలరేగి తన ప్రతాపాన్ని ప్రదర్విస్తుంటే.. నాటో సైన్యం ప్రతిఘటిస్తున్న తరుణం అది. 2024 డిసెంబర్ 11న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓడరేవు నుంచి రెండు పెద్ద “మ్యాన్‌హోల్ కవర్లు,” 129 ఖాళీ షిప్పింగ్ కంటైనర్లు, రెండు పెద్ద లీబ్‌హెర్ క్రేన్‌లతో రష్యా కు తూర్పు ప్రాంతంలోని వ్లాడివోస్టాక్‌కు బయలుదేరింది. డిసెంబర్ 23, 2024 రాత్రి స్పెయిన్​ కు 60 కిలోమీటర్ల దూరంలో మధ్యదర సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు నావికులు మృతి చెందారు. కెప్టెన్​ సహా 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకీ .. ఈ ఓడ ఎందుకు మునిగింది? ఈ ఓడలో ఉన్న సరకులేంటీ? ఈ ఉర్సా మేజర్ లో.. రెండు జలాంతర్గామి అణురియాక్టర్లు.. ఉన్నాయని. వీటిని ఉత్తర కొరియాకు రష్యా తరలిస్తున్నట్టు.. ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ ఈ ఓడపై దాడి ,చూసిందెవరు; నాటో సైన్యంపైనే ఇన్పటికి అనుమానాలు వదలదటం లేదు. కానీ అసలు కారణం వెలుగు చూడటం లేదు. మిస్టరీ వీడటం లేదు. ఈ రష్యా నౌక అత్యంత రహస్య పరిస్థితులలో మునిగిపోయింది. అది ఉత్తర కొరియాకు జలాంతర్గామి అణు రియాక్టర్లను తీసుకువెళుతూ ఉండవచ్చు ,అనేవి ఇప్పటికీ ఊహాగానాలే.

Sparta 3 Mystery : ఎక్కడికి వెళుతోంది?

Sparta 3 Mystery

డిసెంబర్ 23, 2024న మునిగిపోయినప్పటి నుండి ఉర్సా మేజర్ అసాధారణ గతి రహస్యంగానే ఉంది. కానీ, ఒక కీలక మిత్రదేశం ఉత్తర కొరియాకు అణు సాంకేతికత పరిజ్ఙానం చేరరాదనే భావనతో రష్యా వ్యతిరేక పాశ్చాత్య సైన్యం అత్యంత కీలక జోక్యం చేసుకుందని ప్రధాన ఆరోపణ తెరమీదకు వచ్చింది. ఉక్రెయిన్‌పై దండయాత్రలో సహాయంగా ఉత్తర కొరియా సైనికులను తరలించిన రెండు నెలల తర్వాత ఈ నౌక బయలుదేరింది. మధ్యదర సముద్రంలో ము నిగిపోయింది. ధ్వసమైంది.

Sparta 3 Mystery : అసలేం జరిగిందంటే..

Sparta 3 Mystery

అణు పదార్థాల రవాణాకు లైసెన్సీ సంస్థ ఒబోరాన్‌లాజిస్టిక్స్ కు చెందిన ఉర్సా మేజర్ రష్యా తరపున సిరియా కు సైనిక సామగ్రిని తరలించింది. ఇది డిసెంబర్ 2న ఫిన్లాండ్ గల్ఫ్‌లోని ఉస్ట్-లుగా ఇంధన ఓడరేవులో లంగరు వేసింది, ఇక్కడ మ్యాన్‌హోల్ కవర్లు” అమరే చోటుకు కింద ఖాళీ వదిలి, కంటైనర్లను లోడ్​ చేశారు. 2024 డిసెంబర్ 11న సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓడరేవు నుంచి బయలుదేరింది. ఈ నౌక ఫ్రెంచ్ తీరం వెంబడి ప్రయాణించగా, పోర్చుగీస్ నౌకాదళం విమానాలు , , నౌకలు వెంబడించాయి. రష్యన్​ యుద్ధ నౌకలు ఇవాన్ గ్రెన్, అలెగ్జాండర్ ఒట్రాకోవ్స్కీ కూడా ఉర్పా మేజర్​ కు రక్షణగా కనిపించటంతో డిసెంబర్ 22 ఉదయం పోర్చుగీస్ నౌకాదళం వెనక్కి వెళ్లిపోయాయి. సుమారు నాలుగు గంటల తర్వాత, స్పానిష్ జలాల్లో ఆ నౌక వేగం ఒక్కసారిగా తగ్గడంతో, స్పానిష్ సహాయక సిబ్బంది అది ప్రమాదంలో ఉందో లేదో తెలుసుకోవడానికి రేడియో ద్వారా సంప్రదించారు. నౌక సిబ్బంది తాము క్షేమంగానే ఉన్నామని బదులిచ్చారు.

Sparta 3 Mystery : టెన్షన్​ షురూ…

Sparta 3 Mystery

దక్షిణ కార్టజెనా ఓడరేవు అధికారుల సమాచారం ప్రకారం, ఉర్సా మేజర్​ కథ అనుకోని మలుపు తిరిగింది. కానీ సుమారు 24 గంటల తర్వాత, ఆ నౌక తన మార్గం నుంచి వేగంగా పక్కకు మళ్లింది, డిసెంబర్ 23న ఉదయం 11:53 గంటలకు (UTC) సహాయం కోసం అత్యవసర పిలుపునిచ్చింది. కుడి వైపున ఇంజిన్ గది సమీపంలో మూడు పేలుళ్లు సంభవించి, ఇద్దరు మరణించారు. ఈ ఘటనతో నౌక ఒకవైపుకు ఒరిగిపోయింది, కదలలేని స్థితిలోకి జారిపోయింది. . 14 మంది లైఫ్‌బోట్‌లో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు, ఆ తర్వాత వీరిని సాల్వమార్ డ్రాకో అనే స్పానిష్ రెస్క్యూ బోట్ రక్షించింది. రాత్రి 7:27 గంటలకు, మరో స్పానిష్ సైనిక నౌక వచ్చింది. అరగంట తర్వాత, ఉర్సా మేజర్‌కు రక్షణగా వెళ్లిన రష్యన్ సైనిక నౌక ఇవాన్ గ్రెన్, సమీపంలోని నౌకలను రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఉండాలని ఆదేశించింది, తమ సిబ్బందిని వెంటనే తిరిగి అప్పగించచాలని కోరింది.

Sparta 3 Mystery : తప్పని మునక

Sparta 3 Mystery

తాము తప్పనిసరిగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని స్పానిష్ సముద్ర రక్షణ అధికారులు పట్టుబట్టారు, ప్రాణాలతో ఉన్న సిబ్బంది కోసం తనిఖీ చేయడానికి నౌక వద్దకు ఒక హెలికాప్టర్‌ను పంపారు. ఓడలోని నివాస గదులలో ప్రాణాలతో ఉన్న సిబ్సంది కోసం స్పానిష్ రక్షకుడు తనిఖీ చేశాడు. నౌక కంటైనర్ల లోపలికి తొంగి చూశారు. రెండు చెత్త, చేపల వలలు, ఇతర పరికరాలను గమనించాడు.
ఉర్సా మేజర్ స్థిరంగా ఉన్నట్లు త్వరలో మునిగిపోయే అవకాశం లేనట్లు కనిపించింది. కానీ రాత్రి 9:50 గంటలకు ఇవాన్ గ్రెన్ ఆ ప్రదేశంపై వరుసగా ఎర్రటి ఫ్లేర్లను కాల్చంది. ఆ తర్వాత నాలుగు పేలుళ్లు సంభవించాయి.రాత్రి 11:10 గంటలకల్లా ఉర్సా మేజర్ మునిగిపోయింది.

Sparta 3 Mystery : ఇక్కడే మరో ట్విస్ట్​

Sparta 3 Mystery

ప్రాణాలతో బయటపడిన 14 మంది రష్యన్లను కార్టజెనా ఓడరేవు నగరంలో ఒడ్డుకు తీసుకువచ్చారు, అక్కడ స్పానిష్ పోలీసులు దర్యాప్తు అధికారులు విచారించారు. రష్యన్ కెప్టెన్ తన భద్రతకు భయపడి, ఓడలోని ఆరోపిత వస్తువుల గురించి మాట్లాడటానికి విముఖత చూపాడు. ఓడ మానిఫెస్ట్‌లో తొలి జాబితా ప్రకారం మ్యాన్‌హోల్ కవర్లు’ అనడంలో తన ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయమని కెప్టెన్‌పై ఒత్తిడి చేయటంతో.. “జలాంతర్గాముల తయారీకి ఉపయోగించే రెండు అణు రియాక్టర్ల భాగాలు అని కెప్టెన్​ అంగీకరించాడు. అతడి వాంగ్మూలం ప్రకారం, ఆధారాలు ధృవీకరించలేదు. ఓడలో అణు ఇంధనం లేదు. రెండు రియాక్టర్లను ఉత్తర కొరియాలోని రాసన్ ఓడరేవుకు తరలించటమే తన విధిగా రష్యన్ కెప్టెన్ ఇగోర్ అనిసిమోవ్ నమ్మాడు. దేశవ్యాప్తంగా విస్తృత రైలు నెట్‌వర్క్ ఉన్నప్పటి కీ, రెండు క్రేన్‌లు, 100 ఖాళీ కంటైనర్‌లు రెండు పెద్ద మ్యాన్‌హోల్ కవర్ల సరుకును అందించడానికి ఒక రష్యన్ ఓడరేవు నుంచి ప్రపంచాన్ని చుట్టి వచ్చే పడవ యాత్రను ఎంచుకోవటంతో స్పానిష్ దర్యాప్తు సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కొన్ని రోజుల తర్వాత ఓడ సిబ్బందిని రష్యాకు తిరిగి పంపించారు. మూడు పేలుళ్లు జరిగాయని పేర్కొంది. ఓడ బాడీలో 50 సెం.మీ. x 50 సెం.మీ. (20 అంగుళాల x 20 అంగుళాల) రంధ్రం కనిపించింది. దెబ్బతిన్న లోహం లోపలి వైపునకు తిరిగి ఉంది. “ఓడ డెక్ అంతా శ్రాప్నెల్‌తో నిండి ఉంది,” అని కంపెనీ తెలిపింది. “లక్షిత ఉగ్రవాద దాడి”గా అభివర్ణించింది. ఇంతక ఉర్సా ధ్వంష రచన ఎవరిదో.. నాటో దేశాలదా? రష్యా ఆత్మాహుతి చర్యా.. అని ప్రశలు రేగిన తరుణంలో.. ఈ ఉత్కంఠభరిత కథ ..సస్పెన్స్​ స్థితికి చేరింది.

ALSO READ : Us China Talks : అమెరికా..చైనా కీలక భేటీ Andhra Ptabha Top Story

Leave a Reply