డివైడర్ను ఢీకొట్టిన కారు..
డివైడర్ను ఢీకొట్టిన కారు..
_ ఇద్దరు మృతి
_ ప్రాణాపాయ స్థితిలో మరో ఇద్దరు
కమలాపూర్, ఆంధ్రప్రభ : కమలాపూర్ మండలంలోని ఉప్పల్ లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెళుతున్న టీఎస్ 22 ఈ0005 నెంబర్ గల కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాను ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆసుపత్రికి తరలించిన తర్వాత మరణించినట్లు తెలిసింది. మిగతా ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్సాం నుండి కరీంనగర్ లోని లక్ష్మీపూర్ స్వగ్రామానికి వెళ్తున్న ఈ కారు మండలంలోని ఉప్పల్ గ్రామ శివారులో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
