మూడు రోజులుగా కాంట్రాక్టర్ల సమ్మె..!

  • రూ.5 కోట్లకు చెందిన 15 అభివృద్ధి పనులు నిలిపివేత
  • రూ.190 కోట్లు బ్యాంకు లోను ద్వారా చెల్లించాలి
  • చీఫ్ ఇంజనీర్ తో చర్చలు జరిపిన కాంట్రాక్టర్లు
  • కాంట్రాక్టర్ల ను రెండు రోజులు గడువు కోరిన చీఫ్ ఇంజనీర్

విజయవాడ కార్పొరేషన్, ఆంధ్రప్రభ: విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులలో భాగస్వాములైన కాంట్రాక్టర్లు అసోసియేషన్ సభ్యులు గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మె కారణంగా నగరం లో మూడు సర్కిల్ పరిధిలో జరుగుతున్న మంచినీరు,డ్రైనేజీ,రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులు సుమారు రూ. 5 కోట్ల విలువైన పనులు పూర్తి బుధవారం ఉదయం నిలిపి వేసినట్లు కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాయన అధిబాబు వెల్లడించారు.

కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ తో కాంట్రాక్టర్ల చర్చలు..

గత కొద్ది రోజులుగా సెలవులో ఉన్న నగర పాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ సత్య కుమారి బుధవారం ఉదయం విధులకు హాజరు కావడంతో గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా కాంట్రాక్టర్ల ను చర్చలకు పిలిచారు. కాంట్రాక్టర్లు అసోసియేషన్ సభ్యులు చీఫ్ ఇంజనీర్ సత్య కుమారి తో సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లతో చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ.. నిధి పోర్టల్ ద్వారా బిల్లులు ఆఫ్ లోడ్ చేసి 2024 నుంచి 2025 , జూలై వరకు చెల్లిస్తాం అని కాంట్రాక్టర్లు అసోసియేషన్ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. కాంట్రాక్టర్లు మాత్రం తమకు రావలసిన రూ. 350 కోట్ల బిల్లులలో , బ్యాంకు లోన్ ద్వారా రూ.190 కోట్లు చెల్లించాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్ల డిమాండ్స్ ను కమిషనర్ కు వివరిస్తాను. అందుకు రెండు రోజులు సమయం ఇవ్వండి అని కాంట్రాక్టర్ల ను చీఫ్ ఇంజనీర్ కోరారు.

నిలిచి పోయిన అభివృద్ధి పనులు..

ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు లో బాక్స్ కల్వర్టు నిర్మాణం పనులు, చేర్చి సెంటర్ లో బాక్స్ కల్వర్టు నిర్మాణం, పాత బస్తీ జెండా చెట్టు వద్ద కాలువ రైలింగ్ నిర్మాణం, సర్కిల్ –2 లో రాజగోపాల చారి మార్కెట్ నిర్మాణం పనులు, ఎక్సల్ ప్లాంట్ లో వివిధ రకాల అభివృద్ధి పనులు, రాజ రాజేశ్వరి పేటలో వాటర్ మోటార్లు తొలగింపు పనులు, సర్కిల్ — 3 లో ఎన్టీఆర్ కాలనీ డెంటల్ హాస్పిటల్ రోడ్డు నిర్మాణం పనులు, గుణదల హరిజన వాడ రైలింగ్ నిర్మాణం పనులు, వెటర్నరీ కాలనీ వాటర్ ట్యాంకు పనులు, తదితర అభివృద్ధి పనులు నిలిపివేశారు.