ఏటీసీ శిక్షణతో ఉజ్వల భవిష్యత్..
ఏటీసీ శిక్షణతో ఉజ్వల భవిష్యత్..
- ఎస్సై ఉదయ్ కిరణ్
జన్నారం, ఆంధ్రప్రభ : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్( ఏటీసీ) శిక్షణతో యువతకు ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎటీసీ అంటే ఏమిటి ? పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐటిఐలకు అనుబంధంగా ఏటీసీలను నెలకొల్పిందన్నారు. అత్యాధునిక మిషనరీపై పని చేస్తూనే నేర్చుకుంటారని, ఏటీసీలలో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి నేర్చుకున్న యువతకు టాప్ కంపెనీలో 100శాతం ప్లేస్మెంట్ లభించేలాగా చూస్తుందని ఆయన తెలిపారు.నేర్చుకున్న యువకులు తమ సొంత కాళ్లపై నిలబడి ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏటీసీ ప్రిన్సిపాల్ వై. రమేష్,పర్యవేక్షకుడు పి. భాను,అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఎం.శంకర్ పాల్గొన్నారు.
