2: 00 P.M. | 19 జూన్ 2026 ముఖ్యాంశాలు

2: 00 P.M. | 19 జూన్ 2026 ముఖ్యాంశాలు

TempleNote | అత్త‌చ‌నిపోవాల‌ని నోటుపై రాసి..

2: 00 P.M

TempleNote | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దేవాలయాలకు వచ్చే భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవుడిని ప్రార్థించడం సహజం. ఉద్యోగం రావాలని, ఆరోగ్యం బాగుండాలని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని మొక్కులు పెట్టడం తరచూ కనిపించే విషయమే. అయితే అనంతపురం జిల్లాలోని ఓ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా click here to read full news

NEET UG | అభ్యర్థుల పిటిషన్ కొట్టివేత

2: 00 P.M

NEET UG | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జూన్‌ 21న నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. click here to read full news

Singareni Clash | సింగరేణిపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు

2: 00 P.M

Singareni Clash | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సింగరేణి సంస్థపై భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శలు, రాజకీయ పర్యటనలు పూర్తిగా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ప్రభుత్వ విప్ అద్దంకి ద‌యాక‌ర్ విమర్శించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరించకుండా, ఇప్పుడు సింగరేణి పేరుతో రాజకీయాలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. click here to read full news

Job Motivation | ఇలా చేసి ఆసక్తి పెంచుకోండి..

Job Motivation | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రతిరోజూ ఒకే రకమైన పని చేయడం వల్ల చాలామందికి ఉద్యోగం బోరింగ్‌గా అనిపిస్తుంది. పనిపై ఆసక్తి తగ్గడం, ఉత్సాహం కోల్పోవడం, కొత్త సవాళ్లు లేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగం భారంగా మారుతుంది. అయితే కొన్ని చిన్న మార్పులు, కొత్త లక్ష్యాలు, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా పనిలో మళ్లీ ఉత్సాహాన్ని పెంచుకోవచ్చని కెరీర్ నిపుణులు సూచిస్తున్నారు. click here to read full news

DSC Scam Exposed | సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

2: 00 P.M

DSC Scam Exposed |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలసి వివరించనున్నట్లు తెలిపారు. click here to read full news

RahulGandhi | ఘ‌నంగా రాహుల్ గాంధీ జ‌న్మ‌దినం

2: 00 P.M

RahulGandhi | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక అలియా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అబిడ్స్‌లోని ఈ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. click here to read full news

ITI Admissions | దుబ్బాక ప్రభుత్వ ఐటీఐ దరఖాస్తుల గడువు పొడిగింపు

2: 00 P.M

ITI Admissions | సిద్దిపేట, ఆంధ్రప్రభ : వృత్తి విద్యను అభ్యసించాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)/ఏటీసీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత ప్రవేశాల దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు సంస్థ ప్రిన్సిపాల్ జి. కనకయ్య తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. click here to read full news

Political Murder Case | కూటమిపై అమర్‌నాథ్ ఫైర్

2: 00 P.M

Political Murder Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నది “మేకప్ ప్రభుత్వం” అని వ్యాఖ్యానిస్తూ, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. click here to read full news

Minor Driving Crackdown | సిటీ క‌మిష‌న‌ర్ సీపీ సజ్జనార్

2: 00 P.M

Minor Driving Crackdown | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నగరంలో మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలు పెరుగుతుండటంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు ఇకపై చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. click here to read full news

Allu Arjun Summons | విచారణకు హాజరు కావాలని…

2: 00 P.M

Allu Arjun Summons | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. click here to read full news

పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి