కృష్ణలంక సీఐగా మురళీకృష్ణ..

కృష్ణలంక సీఐగా మురళీకృష్ణ..

స్టేషన్ లో బాధ్యతల స్వీకారం
కంకిపాడు నుంచి బదిలీపై కృష్ణాలంక నియామకం
మాజీ సీఐ నాగరాజుకు ఏలూరు రేంజ్ వీఆర్‌కు బదిలీ

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పోలీసు శాఖ బదిలీల్లో భాగంగా కంకిపాడు సీఐగా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణను కృష్ణలంకకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మురళీకృష్ణ అధికారికంగా సీఐగా బాధ్యతలు చేపట్టారు.

స్థానిక పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. కృష్ణలంక సీఐగా పనిచేసిన నాగరాజును ఏలూరు రేంజ్ వీఆర్‌కు బదిలీ చేస్తూ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో మురళీకృష్ణను నియమించడంతో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ సేవలను మరింత ప్రజలకు చేరువ చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా మురళీకృష్ణ పేర్కొన్నారు.