Pawankalyan | బాలుడిని పరామర్శించిన డిప్యూటీ సీఎం

Pawankalyan | బాలుడిని పరామర్శించిన డిప్యూటీ సీఎం

హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లిన జనసేన అధినేత

Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్‌ (17)ను ఇవాళ‌ హనుమకొండలో పరామర్శించారు.

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌కు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒకసారి కలవాలన్న కోరిక ఉందని తెలిసిన వెంటనే పవన్ స్పందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన ప్రత్యేకంగా హనుమకొండకు చేరుకుని బాలుడి నివాసానికి వెళ్లారు.

నిరంజన్‌ను కలిసి అతని ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడితో కొంతసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా చూసిన నిరంజన్ ఆనందానికి అవధులు లేకపోయాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పవన్ పర్యటనతో ఆ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. అభిమానిపై చూపిన ఈ ఆప్యాయతకు జనసేన కార్యకర్తలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.