Peddi Movie Trend | రామ్‌చరణ్ ఫ్యాన్స్‌లో క్రేజ్ మామూలుగా లేదు!

Peddi Movie Trend | రామ్‌చరణ్ ఫ్యాన్స్‌లో క్రేజ్ మామూలుగా లేదు!
Peddi Movie Trend | ‘పెద్ది’ ఫస్ట్‌లుక్‌తోనే సోషల్ మీడియాలో హడావిడి
రామ్‌చరణ్ గదకు మార్కెట్‌లో పెరిగిన డిమాండ్
సినిమా రిలీజ్‌కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు
Peddi Movie Trend |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కొన్నిసార్లు సినిమాల ప్రభావం మనపై చాలా బలంగా ఉంటుంది. అందులో హీరో లేదా హీరోయిన్ వేసుకునే బట్టలు కానీ, నగలు కానీ, వారు వాడిన వస్తువులు కానీ చూడగానే.. “అరే.. బాగుంది కదా!” అనిపిస్తుంది. వారం తిరగకముందే అచ్చం అలాంటి మోడల్స్ మార్కెట్‌లో దర్శనమిస్తాయి. అంతే.. ఇక కొన్ని రోజుల పాటు అవే ట్రెండ్‌గా మారిపోతాయి.
అమ్మాయిలు అయితే నగలు, మేకప్‌పై ఎక్కువగా దృష్టి పెడితే.. అబ్బాయిలు మాత్రం హీరో వేసుకున్న టీషర్ట్, షర్ట్ లేదా హీరో వాడిన బైక్‌పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే త్వరలో రిలీజ్ కాబోయే రామ్‌చరణ్ సినిమాలోని ఒక వస్తువు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ ఒకవైపు క్రికెటర్‌గా, అథ్లెట్‌గా.. మరోవైపు కుస్తీలు పడుతూ కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. ఫస్ట్‌లుక్‌లోనే రామ్‌చరణ్ పైల్వాన్‌లా గద పట్టుకుని కనిపించడం అందరినీ ఆకర్షించింది. అయితే ఇప్పుడు పైల్వాన్ గెటప్‌లో రామ్‌చరణ్ పట్టుకున్న ఆ గద సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.
సాధారణంగా పైల్వాన్లు వాడే గదలు వేరేలా ఉంటాయి. కానీ సినిమాలో రామ్‌చరణ్ వాడిన గద హనుమంతుడి గదను పోలి ఉండటం విశేషం. దీంతో ఆ గదపై అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది.

ఇప్పుడు మార్కెట్‌లో ఈ గదలు అమ్మకానికి రావడంతో వాటిని కొనేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు. దాదాపు రూ.700 నుంచి రూ.2,000 వరకు వీటి ధర ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా, రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకంటే ముందే రామ్‌చరణ్ పట్టుకున్న గద ట్రెండ్‌గా మారడంతో.. రిలీజ్ తర్వాత ఈ క్రేజ్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి.
CLICK HERE TO READ Mahesh Babu | బర్త్‌డే స్పెషల్‌గా థియేటర్లలోకి ప్రిన్స్ క్లాసిక్ సినిమాలు
