Mothkur తెలంగాణ గౌడ యువజన విభాగం నియామకం
Mothkur తెలంగాణ గౌడ యువజన విభాగం నియామకం
మోత్కూర్ (Mothkur), ఆంధ్రప్రభ: తెలంగాణ గౌడ యువజన విభాగం మోత్కూర్ మండల అధ్యక్షుడిగా మొల్కపురి గోవర్ధన్ గౌడ్‌ను నియమించారు.
తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ ఆదేశాల మేరకు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం వరప్రసాద్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేసి స్వయంగా అందజేశారు.
తనపై నమ్మకం ఉంచి మండల గౌడ యువజన అధ్యక్ష పదవి అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు గోవర్ధన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గౌడ యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
