గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం..

గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం..

వెల్దండ, ఆంధ్ర ప్రభ : గ్రామపంచాయతీ అభివృద్దె ప్రధాన లక్ష్యంమంటూ స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్) కింద మంజూరైన 5 లక్షల రూపాయలతో మండల కేంద్రంలోని 3వ వార్డులో బుధవారం సిసి రోడ్ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలని కల్పిస్తామని అన్నారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్,ఉప సర్పంచ్ ఎర్ర శీను ముదిరాజ్, వార్డ్ మెంబర్లు గుద్దటి కిష్టల్,ముదిగొండ కవిత రమేష్, గోసుల కొండయ్య, పిల్లి దేవేందర్, రేవెల్లి మానస రాజు, బాదేపల్లి రమేష్, సిరసనగండ్ల శేఖర్, వాణి పురుషోత్తమ చారి,రంగనాథం మల్లీశ్వరి, గోపి రెడ్డి రాఘవరెడ్డి,, కొయ్యల పుల్లయ్య,ఎండి అమీదు,మంగళగిరి శీను, మాడుగుల శంకర్, జోగు రవికుమార్, ఈదులపల్లి రాజు, మట్ట మల్లేష్ గౌడ్, అంగన్వాడి టీచర్లు,తదితరులు పాల్గొన్నారు.