Rajasthan ను మరోసారి కమ్మేసిన రాకాసి ఇసుక తుఫాన్
Rajasthan ను మరో కమ్మేసిన రాకాసి ఇసుక తుఫాన్
- రాకాసి ఇసుక తుఫాన్..
- చీకట్లో మునిగిన చురు నగరం
- వైరల్ వీడియోలు..
- రాజస్థాన్లో భయానకంగా మారిన వాతావరణం
- గంటకు 70 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఇసుక తుఫాన్
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రకృతి ప్రకోపానికి మరోసారి రాజస్థాన్ రాష్ట్రం వేదికైంది. భారీ ఇసుక తుఫాన్ చురు జిల్లాను కమ్మేసింది. సోమవారం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈ రాకాసి తుఫాన్ ధాటికి పట్టపగలే ఆ ప్రాంతం అంధకారంలో మునిగిపోయింది. దట్టమైన దుమ్ము, ఇసుక మేఘాలు నగరాన్ని పూర్తిగా ఆవరించడంతో రహదారులపై జీరో విజిబిలిటీ పరిస్థితులు నెలకొన్నాయి.
ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ వ్యవస్థ దెబ్బతినగా, ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. భయానకంగా కనిపించిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితమే బికనీర్ ప్రాంతంలో కూడా ఇదే తరహా ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. తాజాగా చురు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
