సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

  • జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : ప్రజలకు, ముఖ్యంగా తనను నమ్ముకున్న కుటుంబాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఆదివారం హనుమకొండ జిల్లా జీడబ్ల్యూఎంసీ 65వ డివిజన్ పరిధిలోని మునిపల్లిలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు ఏరుకొండ శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన నూతన కమిటీ సభ్యులను అభినందించి, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

అనంతరం కమిటీ సభ్యులతో సమావేశమై ముదిరాజ్ సంఘానికి సంబంధించిన సమస్యలు, అవసరాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మునిపల్లి ముదిరాజ్ సంఘ సభ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పార్టీని, తనను నమ్ముకున్న కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఉచిత రాజయ్య, ఉపాధ్యక్షుడు తోపేల రవీందర్, కార్యదర్శి ఉచిత రవి, కార్యవర్గ సభ్యులు ఉచిత పోశాలు, ఉచిత సమయ్య, ఉచిత బాబు, అలుగు శ్రీధర్, ఉచిత రవి, సంఘ పెద్దలు ఉచిత రవీందర్, ఉచిత కుమారస్వామి, ఉచిత రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నద్దునూరి కిషన్, బత్తుల రాజేందర్, మట్టేడ చందు, నద్దునూరి పవన్ కళ్యాణ్, కొలిపాక వెంకటేష్, ఉచిత సదానందం, ఉచిత పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply