60-day-mou : 2 నెలలు సెలవు Andhra Prabha Top News
60-day-mou : 2 నెలలు సెలవు Andhra Prabha Top News
- ఇరాన్ శాంతి ఒప్పందం
- ట్రంస్ ప్రతిపాదన
- కొన్ని గంటల్లో ఎంవోయూ
( ఆంధ్రప్రభ, వాషింగ్గటన్ ప్రతినిధి)
60-day-mou : మధ్యప్రాచ్యాన్ని వణికిస్తున్న ఉద్రిక్తతలకు తెరదించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. 60 రోజుల కాల్పుల విరమణతో పాటు అణు కార్యక్రమంపై తుది చర్చలు జరపాలని ప్రతిపాదించారు. హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకాయానానికి తిరిగి తెరవనున్నట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.మధ్య ప్రాచ్యంలో యుద్ధానికి అమెరికా ఇరాన్ రెండు నెలల సెలవు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2026లో ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధ వాతావరణాన్ని ముగింపు పలికేలా, ఈ ప్రాథమిక ఒప్పందం పై ఆదివారం (జూన్ 14, 2026) సంతకాలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ ప్రతిపాదిత ఒప్పందం వివరాలు ఇలా ఉన్నాయి. 1. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలక హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగా.. ఇరాన్ రేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధం విధించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల రాకపోకల కోసం “అందరికీ తక్షణమే తెరుస్తాం” అని ట్రంప్ స్పష్టం చేశారు. మొదటి 30 రోజుల్లోనే సాధారణ స్థాయి వాణిజ్యం ప్రారంభం అవుతుంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునే ఒక బలమైన రక్షణ గోడ లా ఈ ఒప్పందం పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. ప్రాంతీయంగా పరిస్థితులు శాంతించిన తర్వాత, ఇరాన్ పర్వతాల కింద దాచిన అణు వ్యర్థాలను అమెరికాకు చెందిన బలగాలు వెలికితీసి పూర్తిగా నాశనం చేస్తాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం అమెరికా తరపున ఇరాన్‌కు ఎలాంటి నగదు లేదా నిధులు బదిలీ చేయడం లేదని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య 60 రోజుల పాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇరాన్ అణు కార్యక్రమంపై తుది చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగే ఈ 60 రోజుల కాలానికి గానూ ఇరాన్‌పై కొన్ని ఆర్థిక ఆంక్షలను అమెరికా సడలించనుంది, తద్వారా ఇరాన్ చమురు అమ్ముకోవడానికి వీలవుతుంది.
60-day-mou : లెబనాన్ సరిహద్దుల్లో శాంతి
ఈ ప్రతిపాదనల ప్రకారం కేవలం అమెరికా-ఇరాన్ మాత్రమే కాకుండా, లెబనాన్, ఇజ్రాయెల్ సహా అన్ని ఫ్రంట్‌లలోనూ యుద్ధం తాత్కాలికంగా ఆగుతుంది. ఆదివారమే సంతకాలు జరుగుతాయని చెప్తున్నప్పటికీ, ఇరాన్ విదేశాంగ శాఖ దీన్ని పాక్షికంగా ఖండించింది. ఆదివారమే సంతకాల ప్రక్రియ ఉండకపోవచ్చని, రాబోయే కొద్ది రోజుల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని ఇరాన్ పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల ఇరాన్ అమెరికాకు లొంగిపోయినట్లు అవుతుందని భావిస్తూ ఇరాన్ విప్లవాత్మక (IRGC) మద్దతుదారులు, కొందరు కన్సర్వేటివ్ ఎంపీలు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
60-day-mou : ఇజ్రాయెల్ అభ్యంతం
ఈ ఒప్పందం వల్ల లెబనాన్‌లో హిజ్బుల్లాపై తాము జరుపుతున్న సైనిక దాడులను తగ్గించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ట్రంప్ నిర్ణయం పట్ల కొంత అసంతృప్తితో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. చారిత్రాత్మక ఒప్పందం కుదర్చడంలో పాకిస్తాన్ దేశం కీలక రాయబార పాత్ర పోషించింది. ఐరోపా (జెనీవా) వేదికగా జరగబోయే ఈ సంతకాల కార్యక్రమానికి అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది.
