RealLife Spider Man | ‘రియల్ లైఫ్ స్పైడర్‌మ్యాన్’ మృతి
RealLife Spider Man | ‘రియల్ లైఫ్ స్పైడర్‌మ్యాన్’ మృతి
RealLife Spider Man | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: యెమెన్‌కు చెందిన ‘రియల్ లైఫ్ స్పైడర్‌మ్యాన్’గా పేరొందిన అల్-ఖాఖా విషాదకరంగా మృతి చెందినట్లు సమాచారం. నిటారుగా ఉన్న కొండలను ఎక్కే సాహసాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆయన, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
యెమెన్‌లోని దామత్ అగ్నిపర్వత ప్రాంతంలోని కొండలపై విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో అల్-ఖాఖా పట్టుతప్పి లోతైన వేడి నీటి గుండంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, సహాయక బృందాలు రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదని సమాచారం.

యెమెన్‌లో ఆధునిక రక్షణ పరికరాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా మృతదేహాన్ని వెలికితీయడంలో సహాయక బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా సాహస విన్యాసాలు చేసి సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన అల్-ఖాఖా మరణం అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనతో ప్రాణాలను పణంగా పెట్టి చేసే సాహసాలు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో మరోసారి స్పష్టమైంది.
