Pavan | తల్లి అంజనాదేవికి అస్వస్థత.. హైదరాబాద్ కు బయల్దేరిన పవన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలయ్యారు. అయితే కేబినెట్ సమావేశం నుంచి వెంటనే పవన్ బయల్దేరారు. కాసేపట్లో పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్ (Hyderabad) చేరుకోనున్నారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ‌ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో దాదాపు 31 అంశాలు ఏజెండా గురించి చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశంలో విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు భూమి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే అమరావతిలో రెండు దశల్లో 44వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply