అస్వస్థకు గురైన 11 మంది..
అస్వస్థకు గురైన 11 మంది..
- రామగుండం మెడికల్ కాలేజీ విద్యార్థులు
- బర్త్ డే పార్టీకి బిర్యానీ తినడంతో ఘటన
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్
గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి మెడికల్ కళాశాల (సిమ్స్)కు చెందిన 11 మంది విద్యార్థులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ కాలేజ్ చెందిన విద్యార్థుల్లో ఒకరి బర్త్ డే పార్టీ నేపథ్యంలో గోదావరిఖని కవిత థియేటర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న అనంతరం వారికి వాంతులు, విరోచనాలకు గురయ్యారు.

అస్వస్థకు గురైన మెడికల్ కాలేజ్ విద్యార్థులను హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని, అందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తున్నామని ఆర్‌ఎంఓ కృప బాయ్ వెల్లడించారు. సదరు మెడికల్ కాలేజీ విద్యార్థులు స్థానికంగా ఓ ప్రైవేటు రెస్టారెంట్లో బిర్యాని తిన్న అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే ఫుడ్ పాయిజనింగ్ కు సంబంధించిన అసలు వివరాలు తెలుస్తాయి.
