గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
- స్వచ్ఛ భారత్ మిషన్ నాయకుల వినతి
ధర్మపురి, ఆంధ్రప్రభ:
2027లో ధర్మపురిలో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా నాయకులు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి కోరారు.
ఈ మేరకు ఆయన ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు.
పుష్కరాల నిర్వహణలో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, భూమిలో ఇది సులభంగా కరగకపోవడంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ప్రజలకు, పర్యావరణానికి నష్టం కలగకుండా అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు వేముల రాజేశ్, మున్సిపల్ కౌన్సిలర్ సంగి ఆనంద్, నాయకులు గాజు సాగర్, బొడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
