రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే…

రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : రైతుల పండించిన వడ్లు మొక్కజొన్నతో పాటుగా పొద్దుతిరుగుడు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని రసమయి బాలకిషన్ సందర్శించి రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.