శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

టీటీడీ అధికారుల స్వాగతం, వేద పండితుల ఆశీర్వచనం

తిరుమల, (ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఇష్టికపాల స్వాగతం పలికారు.

ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం జస్టిస్ లీసా గిల్ స్వామివారి మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.