ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఆటో డ్రైవర్ల ప్రతిజ్ఞ

ట్రాఫిక్ నియమ నిబంధనలపై ఆటో డ్రైవర్ల ప్రతిజ్ఞ

పాయకాపురం, ఆంధ్రప్రభ : నేను ఒక బాధ్యతాయుతమైన ఆటో డ్రైవర్‌గా, రహదారి భద్రతా నియమాలను ఎల్లప్పుడూ పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమం బుధవారం 6వ ట్రాఫిక్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు అతివేగంగా వాహనం నడపనని, మద్యం సేవించి లేదా మత్తు పదార్థాల ప్రభావంలో ఆటో నడపనని,వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించనని, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తానని, ఆటోలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించనని, ట్రాఫిక్ సంకేతాలు, పోలీసుల సూచనలను గౌరవించి పాటిస్తానని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.