ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా..

  • ధర్మపురిలో ఇసుక తవ్వకాలు స్థానిక అవసరాలకే..
  • జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో కొత్త రికార్డు..
  • రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

జగిత్యాల, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లాలో యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఎలాంటి అక్రమాలు లేవని, ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు నిరూపి స్తె తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. గత యాసంగి సీజన్లో జగిత్యాల జిల్లాలో 80వేల మంది రైతుల వద్ద 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి అడ్లూరి తెలిపారు.

ఈ ఏడాది యాసంగి సీజన్లో జిల్లాలో 5.12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 5.08లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వి వరించారు. జిల్లాలో మొత్తం 436 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 417 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యాయని మంత్రి వివరించారు. మరో 19 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి వివరించారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు రూ. 1,215కోట్లు విలువైన ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి వరకు 79,736 మంది రైతుల ఖాతాల్లో రూ. 1,075కోట్లు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రాత్రి, పగలు తేడా లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి అడ్లూరి తెలిపారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డితోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వడ్ల కొనుగోలులో జిల్లాలో రూ. 107కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బుదర జల్లె కార్యక్రమంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి ఆరోపించారు. జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తే అవినీతి జరగలేదు.. కాని జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లితేనే వడ్ల కొనుగోలులో అవినీతి జరిగిందా.. అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణపై ప్రతిపక్షలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

Leave a Reply