హోరాహోరీ పోటీల్లో ఫైనల్ కి దూసుకెళ్లిన పోలీస్ టీం

హోరాహోరీ పోటీల్లో ఫైనల్ కి దూసుకెళ్లిన పోలీస్ టీం

చాకచక్యంగా ఆడిన కోడూరు పోలీస్ టీం
అన్ని విభాగాల్లో రాణించిన పోలీస్ టీమ్ కెప్టెన్
ఎస్ఐ చాణిక్య

(కోడూరు -ఆంధ్ర ప్రభ ) : కోడూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి ( కేపీఎల్ ). జనసేన పార్టీ యువ నాయకుడు బచ్చు వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ పోటీలు ఉత్సాహవంతంగా జరుగుతున్నాయి. శనివారం నాడు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో కోడూరు పోలీస్ టీం- దింటి మేరకటీమ్ ల మధ్య జరిగిన పోటీలో కోడూరు పోలీస్ స్టేషన్ టీమ్ బౌలింగ్, ఫీలింగ్, బ్యాటింగ్లో సత్తా చాటి ఫైనల్ కు చేరుకుంది.. మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ టీం 16 ఓవర్ లకు 91 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ కు దిగిన దింటి మేరకు14.1 ఓవర్లు కే ఆల్ అవుట్ అయిపోయారు.24 పరుగుల తేడాతో పోలీస్ టీం విజయకేతనం ఎగరవేసి ఫైనల్ కు దూసుకుని వెళ్లారు పోలీస్ టీం కు చెందిన అశ్వానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ను ఎస్సై చాణిక్య, బచ్చు వెంకటేష్, బచ్చు పూర్ణచందర్రావు చేతుల మీదుగా అందించారు.