మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి బుధవారం పరామర్శించారు. మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరమర్శించి వారి తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి,ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనాగిరి భాస్కర్,గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగాధర్,వేముల గంగారెడ్డి,ఏనుగు అశోక్,పడిగెల ప్రవీణ్ ప్రవీణ్,గోపిడి లింగారెడ్డి, మురళి,మహేందర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
