కంఠలిలో జోరుగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో పారిశుద్ధ్యపనులతో పాటు పచ్చదనం,పారిశుభ్రత పనులు కూడా జోరుగా కొనసాగుతున్నయి. గ్రామ సర్పంచ్ ఎం.నగనాథ్, పంచాయతీపాలకవర్గ ఆధ్వర్యంలో మురికి కాలువల పూడికతీత, పశువులతొట్టెల్లో పేర్కొన్న పాకురును తొలగించడమే కాకుండా,ట్యాంకర్ ద్వారా చెట్లకు నీరు అందించడం జరుగుతుంది.

దీంతో పాటు ప్రధానరహదారి ఇరుపక్కల పిచ్చిచెట్లును,ముళ్ళ పొదలను కూడా తొలగించడం జరుగుతున్నది. గ్రామపంచాయతీ ద్వారా గ్రామస్తులకు తమ వంతు సేవలు అందించడం జరుగుతుందని,గ్రామ అభివృద్ధికి,పచ్చదనం పారిశుభ్రతకు గ్రామస్తులు తమవంతు సహకారం అందించాలని,ఎలాంటి అవసరాలున్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ ఎం.నాగనాథ్ విన్నవించారు.

Leave a Reply