Builder Threat Case | అంబ‌ర్‌పేట్ శంక‌ర్‌పై కేసు న‌మోదు?

Builder Threat Case | అంబ‌ర్‌పేట్ శంక‌ర్‌పై కేసు న‌మోదు?

Builder Threat Case |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ నేత, అంబర్‌పేటకు చెందిన శంకర్ ముదిరాజ్‌పై భూ సెటిల్‌మెంట్లు మరియు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పరిధిలో అంబర్‌పేట్ శంకర్‌తో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించారనే ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల కోసం, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించారని సదరు బిల్డర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది. అంబర్‌పేట ప్రాంతంలో చురుకైన నాయకుడిగా ఉన్న శంకర్ ముదిరాజ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.