వాకర్స్ అసోసియేషన్ ఆదర్శoగా నిలువాలి

వాకర్స్ అసోసియేషన్ ఆదర్శoగా నిలువాలి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఇటీవల నిర్వహించిన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులుగా దొంతి తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులుగా నాగవెళ్లి యుగేందర్, కార్యదర్శిగా బిరుదురాజు రఘురామరాజు, సంయుక్త కార్యదర్శిగా తాళ్లపెల్లి రవీందర్, కోశాధికారిగా సలీం, కార్యవర్గ సభ్యులుగా సంకేపల్లి దివాకర్ రెడ్డి, ఆడెపు భాస్కర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో వాకర్స్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లోనూ ముందుండి పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని నూతన కార్యవర్గ సభ్యులకు సూచించారు. నూతన కమిటీ వాకర్స్ పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.