మంత్రి ఫిర్యాదుతో కేసు.. 3 టౌన్ పోలీసుల ఎదుట బైరెడ్డి హాజరు

మంత్రి ఫిర్యాదుతో కేసు.. 3 టౌన్ పోలీసుల ఎదుట బైరెడ్డి హాజరు

కర్నూలు, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జీ. భరత్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంగళవారం కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు.

గత నెల 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వైసీపీ ధర్నా కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ కుటుంబంపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదు అయినట్లు సమాచారం.

ఒక ఫార్మా కంపెనీ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలపై పోలీసులు వివరణ కోరగా, ఆయన తన వాదనలు వినిపించినట్లు తెలిసింది.

అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply