అంగన్‌వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ..
- ప్రీ-స్కూల్ బోధనకు టీవీ వినియోగించాలని ఆదేశం
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ మంగళవారం పత్తికొండ మండలంలోని కనకదిన్నె అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
సందర్శన సందర్భంగా ప్రభుత్వం అందజేసిన టెలివిజన్‌ను ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాల కోసం వినియోగించడం లేదని గుర్తించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రతిరోజూ టీవీ ద్వారా ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని అంగన్‌వాడీ కార్యకర్తకు ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా కేంద్రంలో విద్యుత్ బల్బు లేకపోవడంతో వెంటనే బల్బు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందజేసిన అన్ని సౌకర్యాలు, పరికరాలను సమర్థవంతంగా వినియోగించి చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించాలని విజయ సూచించారు.
