London Tragedy | భారత సంతతికి చెందిన ముగ్గురు మృతి
London Tragedy | భారత సంతతికి చెందిన ముగ్గురు మృతి
London Tragedy | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భవనం పై అంతస్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాకేశ్ పాయ్ (47), అదితి పరాల్కర్, వారి తొమ్మిదేళ్ల కుమారుడు సిద్గా అధికారులు గుర్తించారు. వీరు నివసిస్తున్న భవనంలోని 36వ అంతస్తు నుంచి కిందపడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మృతుడైన బాలుడు సిద్ పుట్టుకతోనే తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ విషాద ఘటనతో స్థానిక భారతీయ సమాజంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
