కోటి రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

కోటి రూపాయల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. కళాశాల ఆవరణలో సరైన రహదారి సౌకర్యం లేక విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నాణ్యమైన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.

గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించాలంటే వారికి అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. విద్యా సంస్థల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడప జెలై జాకు, ఉప సర్పంచ్ లోక శిరీష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, పాండు, గాడ్గే సుభాష్, సాబీర్, సమీఉల్లా, మహేందర్‌రెడ్డి, రాథోడ్ ప్రవీణ్, మహేష్, నాగోరవ్, ప్రవీణ్, రాథోడ్ రమేష్, సచిన్, విష్ణు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.